WhatsApp లో మెసేజ్ 'ఎడిట్ ఆప్షన్' ఫీచర్

Home >>> బిజినెస్ > WhatsApp లో మెసేజ్ 'ఎడిట్ ఆప్షన్' ఫీచర్

news-details

వాట్సాప్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు ఈ వాట్సాప్ లేకపోతే.. ఎవరూ ఉండటం లేదు. అయితే.. తాజాగా వాట్సాప్ వినియోగ దారులకు అదిరిపోయే శుభవార్త. వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుంది. పొరపాటున ఏదైనా మెసేజ్ అవతలి వారికి పంపిస్తే దాని డిలీట్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం ఉంది. తాజాగా మనం పంపిన సందేశంలో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే దాన్ని సరిచేసుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్ ను వాట్సప్ తీసుకొస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ ఈ ఫీచర్ రానుంది.

 

వాట్సప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ కింద ఏదైనా సందేశాన్ని 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. అందుకోసం మనం పంపిన మెసేజ్ పై క్లిక్ చేసి కాసేపు హోల్డ్ చేయాలి. అప్పుడు కాపీ అనే ఆప్షన్ తో పాటు ఎడిట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మార్పులు చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోపు ఎన్నిసార్లు అయినా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఒకసారి ఎడిట్ చేశాక ఎడిటెడ్ అనే సందేశం అవతలి వ్యక్తికి ఈ మెసేజ్ కింద కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ యాప్ తో పాటు, ఐఓఎస్, వెబ్ యూజర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేది మాత్రం వాట్సాప్ వెల్లడించలేదు.

You can share this post!

Related Posts